Shahrukh Khan: అంబానీ ఇంట మెడలో పాముతో దర్శనమిచ్చిన షారుఖ్ ఖాన్

  • ఈషా అంబానీ కవల పిల్లలకు ముంబయిలో పుట్టినరోజు వేడుకలు
  • పార్టీకి హాజరైన బాలీవుడ్ తారలు
  • షారుఖ్ ఖాన్ పాముల వీడియో వైరల్
SRK seen snakes in his neck at Mukesh Ambani party

బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారుఖ్ ఖాన్ మెడలో పాముతో కనిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కుమార్తె ఈషా గతేడాది నవంబరు 19న కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఆ కవల పిల్లలకు ముంబయిలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సంబరాలకు బాలీవుడ్ తారలు కూడా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన షారుఖ్ ఖాన్ మెడలో పాముతో సందడి చేశారు. మొదట అనంత్ అంబానీ... షారుఖ్ ఖాన్ చేతికి ఓ పామును అందిస్తుండగా, వెనుక నుంచి మరొకరు ఆయన మెడలో పామును వేయడం వీడియోలో కనిపించింది. అయితే, ఎలాంటి ఆందోళనకు గురికాకుండా షారుఖ్ ఖాన్ ప్రశాంతంగా అనంత్ అంబానీతో మాట్లాడారు.

More Telugu News