World Cup: వరల్డ్ కప్ ఫైనల్: టాస్ గెలిచిన ఆసీస్... అయినా రోహిత్ కోరుకున్నదే దక్కింది!

  • వరల్డ్ కప్ ఫైనల్ కు సర్వం సిద్ధం
  • అహ్మదాబాద్ లో టీమిండియా వర్సెస్ ఆసీస్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
  • టీమిండియాకు మొదట బ్యాటింగ్
Australia won the toss in world cup final

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న వరల్డ్ కప్ ఫైనల్ నేడు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. వరల్డ్ కప్ టైటిల్ కోసం టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. టాస్ సమయంలో టీమిండియా సారథి రోహిత్ శర్మ మాట్లాడుతూ, ఒకవేళ తాము టాస్ గెలిచి ఉంటే మొదట బ్యాటింగే తీసుకునేవాళ్లమని వెల్లడించాడు. ఇప్పుడు టాస్ ఓడినా రోహిత్ కోరుకున్నదే దక్కినట్టయింది. ఫైనల్ కోసం తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని రోహిత్ చెప్పాడు. అటు, ఆసీస్ జట్టులోనూ ఈ మ్యాచ్ కోసం మార్పులేవీ లేవు. 


టీమిండియా...
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా...
పాట్ కమిన్స్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మ్యాక్స్ వెల్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజెల్ వుడ్.

More Telugu News