Jagapathi Babu: హాలీవుడ్‌లోకి మన జగ్గూభాయ్.. వెళ్లమంటారా? అని అభిమానులకు ప్రశ్న

Tollywood Actor Jagapathi Babu Ready To Step Into Hollywood

  • విలక్షణ నటనతో దూసుకెళ్తున్న జగపతిబాబు
  • హాలీవుడ్‌ నుంచి పిలుపు వచ్చిందన్న జగ్గూభాయ్
  • వెళ్లి దున్నేసి రావాలంటూ నెటిజన్ల కామెంట్

టాలీవుడ్‌లో ఒకప్పుడు అగ్రహీరోగా ఓ వెలుగు వెలిగి ఆపై కొంతకాలంపాటు మాయమైన జగపతిబాబు.. సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం దూకుడుమీదున్నారు. విలన్‌గా, కేరెక్టర్ ఆర్టిస్టుగా తానేంటన్నది  నిరూపించుకుంటూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. విలక్షణ నటనతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసిన జగ్గూభాయ్‌ను ఇప్పుడు హాలీవుడ్ కూడా పిలుస్తోంది.

ఈ విషయాన్ని ఆయన ఎక్స్ ఖాతా ద్వారా స్వయంగా వెల్లడించారు. హాలీవుడ్ తనను పిలుస్తోందని, ఏమంటారని అభిమానులను అభిప్రాయం అడిగారు. ఆయన ప్రశ్నకు నెటిజన్లు సరదాగా స్పందించారు. హాలీవుడ్‌ను కూడా దున్నేసి రావాలని కొందరంటే.. ఇంగ్లిష్ వాళ్లు మిమ్మల్ని తట్టుకోగలరా? అని ఇంకొందరు సరదాగా కామెంట్ చేశారు.

Jagapathi Babu
Tollywood
Hollywood
  • Loading...

More Telugu News