Indian Railways: 20 నుంచి 26 వరకు చెన్నై-బిట్రగుంట మధ్య రైళ్ల రద్దు.. కారణం ఇదే!

Trains between Chennai Bitragunta canceled from 20 to 26

  • విజయవాడ-గుంతకల్ మధ్య రైల్వే లైన్ల మరమ్మతులే కారణం
  • రద్దు కానున్న రైళ్ల వివరాలను ప్రకటించిన దక్షిణ రైల్వే
  • రైల్వే ప్రయాణికులకు కీలక అలర్ట్

రైల్వే ప్రయాణికులకు దక్షిణ రైల్వే కీలక సమాచారం అందించింది. ఈ నెల 20 నుంచి 26 వరకు తిరుపతి, బిట్రగుంట వైపు వెళ్లే రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. విజయవాడ, గుంతకల్‌ మధ్య రైల్వే లైన్ల మరమ్మతుల కారణంగా రద్దు చేసినట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. రద్దయిన రైళ్ల వివరాలను పేర్కొంది. నంబర్ 17237 బిట్రగుంట-డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌, 17238 డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-బిట్రగుంట రైళ్లు ఈ నెల 20 నుంచి 24 వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణ రైల్వే తెలిపింది. ఇక నంబర్ 07659 తిరుపతి-కాట్పాడి, 07582 కాట్పాడి-తిరుపతి స్పెషల్‌ ప్యాసింజర్, నంబర్ 06417 కాట్పాడి-జోలార్‌పేట, నెం.06418 జోలార్‌పేట-కాట్పాడి మెమూ రైళ్లు కూడా ఈ నెల 20 నుంచి 26 వరకు రద్దవుతాయని పేర్కొంది. మరోవైపు నంబర్ 06411 అరక్కోణం-కడప, 06401 కడప-అరక్కోణం స్పెషల్‌ మెమూ రైళ్లు కూడా 26 వరకు రద్దవుతాయని తెలిపింది.

తిరుపతి-విల్లుపురం పాక్షికంగా రద్దు..
తిరుపతి-విల్లుపురం ఎక్స్‌ప్రెస్‌, విల్లుపురం-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పాక్షికంగా రద్దవుతున్నాయని తెలిపింది. నంబర్ 16853 తిరుపతి-విల్లుపురం ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 20 నుంచి 26 వరకు తిరుపతికి బదులుగా కాట్పాడి నుంచి బయలుదేరుతుందని రైల్వే వెల్లడించింది. 16854 విల్లుపురం-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 20 నుంచి 26 వరకు తిరుపతికి బదులుగా కాట్పాడి వరకు మాత్రమే నడుస్తుందని తెలియజేసింది.

  • Loading...

More Telugu News