BJP: బీజేపీ 'ఇంద్రధనుస్సు' మేనిఫెస్టోలో 7 ప్రధాన హామీలు... ఉచిత విద్య, వైద్యం కూడా

BJP to release manifesto with IndraDhanussu name

  • మేనిఫెస్టోను విడుదల చేయనున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
  • ప్రధాని నరేంద్రమోదీ గ్యారెంటీతో మేనిఫెస్టోను ప్రకటించనున్న బీజేపీ
  • రైతులకు మద్దతు ధర, ఆయుష్మాన్ భారత్ రెట్టింపు

బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోకు ఇంద్ర ధనుస్సు అని నామకరణం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. త్వరలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా... అందరూ ఆమోదించేలా ఈ మేనిఫెస్టోను సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు దీటుగా బీజేపీ 'ఇంద్రధనుస్సు' మేనిఫెస్టో ఉంటుందని చెబుతున్నారు. ఈ మేనిఫెస్టోలో ఏడు ప్రధాన అంశాలపై బీజేపీ హామీ ఇస్తోందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని నరేంద్రమోదీ గ్యారెంటీతో మేనిఫెస్టోను ప్రకటించనుంది. ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా ఉచిత విద్య, వైద్యంతో పాటు నిరుద్యోగులు, సామాన్యులు, రైతులకు లబ్ధి చేకూర్చే అంశాలతో రూపొందించారని అంటున్నారు. వరికిమద్దతు ధరను రూ.3100 పెంచే యోచన చేస్తోంది. ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షలను రూ.10 లక్షల వరకు పెంచే ఆలోచన చేస్తోంది.

BJP
Telangana Assembly Election
Narendra Modi
Bandi Sanjay
Amit Shah
  • Loading...

More Telugu News