Mangalavaram: 'మంగళవారం' టైటిల్ గురించి సీనియర్ వంశీ ఆ మాట అన్నారు: డైరెక్టర్ అజయ్ భూపతి

  • రేపు విడుదల కానున్న 'మంగళవారం'
  • ఇది పెద్ద వంశీకి ఇష్టమైన టైటిల్ అని వ్యాఖ్య
  • అందుకే ఆయన ఆ టైటిల్ పెట్టలేకపోయాడని వివరణ  
  • గోదావరి నేపథ్యంలో కథ జరుగుతుందని వెల్లడి 

Ajay Bhupathi Interview

అజయ్ భూపతి దర్శకత్వం వహించిన 'మంగళవారం' సినిమా, రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అజయ్ భూపతి మాట్లాడుతూ .. "ఈ కథ అంతా విలేజ్ నేపథ్యంలో జరుగుతుంది. భయపెట్టే క్రమంలో పెట్టిన టైటిలే ఇది. ఈ టైటిల్ పోస్టర్ వదలగానే నాకు ఫస్టు సీనియర్ వంశీ గారి నుంచి కాల్ వచ్చింది" అన్నారు. 

"సీనియర్ వంశీగారికి ఈ టైటిల్ అంటే చాలా ఇష్టమట. 'మంగళవారం' టైటిల్ పెట్టడానికి చాలా ధైర్యం చేశావ్. చాలా సార్లు నేను ఈ టైటిల్ పెడదామని అనుకున్నాను. కానీ మా నిర్మాతలు కొన్ని సెంటిమెంట్స్ కారణంగా ఒప్పుకోలేదు. తప్పకుండా నువ్వు హిట్ కొడతావు అజయ్ " అన్నారు. 

"వంశీ గారికి గోదావరి అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాల్లో తప్పకుండా గోదావరి ఉంటుంది. అలాగే నాకు కూడా గోదావరి అంటే ఇష్టం. వంశీగారు కామెడీ నేపథ్యంలో గోదావరిని చూపిస్తే, నేను బ్లాక్ కేరక్టర్స్ నేపథ్యంలో గోదావరిని చూపించాను. గోదావరి తీరంలో జరగడమే ఈ కథకు మరింత బలాన్ని ఇచ్చింది" అని చెప్పారు. 


More Telugu News