world cup 2023: ఫైనల్లో టీమిండియా.. అస్సలు జీర్ణించుకోలేకపోతున్న పాక్ నటి

Pakistan Actress sehar shenwari Tweet on TeamIndia win

  • పాక్ కంటే అన్నింట్లో భారత్ ముందుండడమేంటని సెహర్ షిన్వారీ ట్వీట్
  • బీసీసీఐ, బీజేపీ.. త్వరలోనే సర్వనాశనమవుతాయ్ అంటూ శాపనార్థాలు
  • భారత్ ను ఓడిస్తే బంగ్లాదేశ్ కుర్రాడితో డేట్ చేస్తానంటూ ఇటీవల ప్రకటన

వరల్డ్ కప్ మెగా టోర్నీలో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళుతోంది. సెమీ ఫైనల్ లో న్యూజిలాండ్ ను చిత్తుచేసి ఫైనల్ లో అడుగుపెట్టింది. దీంతో భారత అభిమానులంతా సంబరాలు చేసుకుంటుండగా.. పాకిస్థానీ నటి సెహర్ షిన్వారీ మాత్రం కుళ్లు బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. భారత జట్టు ఫైనల్లో అడుగుపెట్టడం జీర్ణించుకోలేకపోతున్నా అంటూ ట్వీట్ చేసింది. పాకిస్థాన్ కంటే భారత్ అన్నింట్లోనూ ముందు ఎలా ఉంటుందో అర్థం కావడంలేదని సందేహం వ్యక్తం చేసింది. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ ముందే ఫిక్స్ అయి ఉంటుందని ఆరోపించింది. బీసీసీఐ తో పాటు బీజేపీ కూడా త్వరలోనే సర్వనాశనం అవుతాయంటూ సెహర్ షెన్వారీ శాపనార్థాలు పెట్టింది.

ముందే ఫిక్స్ చేసిన మ్యాచ్ లో బాగా ఆడుతున్నట్లు టీమిండియా ఆటగాళ్లు అద్భుతంగా నటించారని, వాళ్లు మంచి నటులని విమర్శిస్తూ సెహర్ షెన్వారీ బుధవారం ట్వీట్ చేసింది. ఈ ట్వీట్లు వైరల్ కావడంతో భారత జట్టు అభిమానులు షెన్వారీపై మండిపడుతున్నారు. కామెంట్లతో రెచ్చిపోతున్నారు. కాగా, లీగ్ మ్యాచ్ లలో పాక్ జట్టు టీమిండియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఆ తర్వాతి మ్యాచ్ లో భారత జట్టు బంగ్లాదేశ్ తో తలపడగా.. బంగ్లా ఆటగాళ్లకు షెన్వారీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారత్ ను చిత్తుగా ఓడిస్తే బంగ్లా కుర్రాడితో డేట్ చేస్తానని ట్వీట్ చేసింది.

world cup 2023
Team India
finals
New Zealand
Pakistan
Actress Shinwari
Twitter
  • Loading...

More Telugu News