Deepika Padukone: దాంపత్య జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేసిన దీపికా పదుకొణే

Deepika Padukone on her marriage life with husband

  • తాను, రణవీర్ ఇద్దరం బిజీ లైఫ్ ను గడుపుతున్నామన్న దీపిక
  • కలిసి గడిపేందుకు సమయం దొరకడం లేదని వెల్లడి
  • ఇకపై ఇద్దరి కోసం ఒక షెడ్యూల్ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నామన్న దీపిక

బాలీవుడ్ స్టార్లు దీపికా పదుకొణే, రణవీర్ సింగ్ లు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కూడా ఎంతో అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతున్నారు. మరోవైపు, తమ వైవాహిక జీవితానికి సంబంధించి దీపిక సంచలన వ్యాఖ్యలు చేసింది. తామిద్దరం చాలా బిజీ లైఫ్ ను గడుపుతున్నామని ఆమె తెలిపింది. కలిసి గడిపేందుకు సమయం దొరకడం లేదని చెప్పింది. కొన్ని సార్లు రణవీర్ అర్ధరాత్రి ఇంటికి వస్తాడని... తానేమో తెల్లవారుజామునే వెళ్లి పోవాల్సి ఉంటుందని తెలిపింది. అందుకే ఇకపై ఇద్దరి కోసం ఒక షెడ్యూల్ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పింది. 

చిన్న వయసులో తాను ముంబైలో అడుగు పెట్టానని... ఆ రోజుల్లో తనకు రూమ్ కూడా ఉండేది కాదని దీపిక తెలిపింది. అర్ధరాత్రి వరకు పని చేసి క్యాబ్ లోనే  నిద్రపోయేదాన్నని చెప్పింది. అవన్నీ గుర్తు చేసుకుంటే ఎంతో సంతోషం కలుగుతుందని... ఎంతో సాధించాననే చిన్నపాటి గర్వం కలుగుతుందని తెలపింది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, తీరిక లేకుండా పని చేస్తూ తనకంటూ ఒక మార్గాన్ని ఏర్పరుచుకున్నానని చెప్పింది. 

Deepika Padukone
Bollywood
Marriage Life
Ranveer Singh
  • Loading...

More Telugu News