Ind Vs NZ: కుదురుకుంటున్న తరుణంలో న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ!

New zealand loses two wickets in quick succession shami

  • వరుసగా కేన్, లాథమ్ వికెట్లు తీసిన షమీ
  • దూకుడుగా ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకున్న మిచెల్
  • 34వ ఓవర్ ముగిసే సరికి స్కోరు 221/4

భారత్‌తో నేడు జరుగుతున్న సెమీస్ ‌మ్యాచ్‌లో తొలుత తడబడ్డ న్యూజిలాండ్ క్రమంగా నిలదొక్కుకుంటున్నట్టు కనిపించింది.  కేన్, మిచెల్ భారత బౌలర్ల దాడిని ఎదుర్కుంటూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వారు క్రీజులో కుదురుకుంటున్నారనుకున్న సమయంలోనే న్యూజిలాండ్‌ను షమీ మరోసారి దెబ్బతీశాడు. 33వ ఓవర్‌లో షమీ వేసిన బంతికి కేన్ విలియమ్సన్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి సూర్యకుమార్‌కు చిక్కాడు. అప్పటికే అర్ధసెంచరీ పూర్తి చేసి కేన్ 69 పరుగుల వద్ద పెవిలియన్ బాట పట్టాడు. ఆ తరువాత వచ్చిన టి.లాథమ్ కూడా షమీ ధాటికి బోణి చేయకుండానే వెనుదిరిగాడు. 

వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో న్యూజిలాండ్ చిక్కుల్లో పడ్డట్టైంది. మరోవైపు, డారిల్ మిచెల్ తన దూకుడు కొనసాగిస్తూ శతకం పూర్తి చేసుకున్నాడు. 33వ ఓవర్‌లో షమీ వేసిన తొలి బంతికి సింగిల్ తీసి సెంచరీ సాధించాడు. 34వ ఓవర్ల ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు 221/4 గా ఉంది. క్రీజులో ప్రస్తుతం గ్లెన్ ఫిలిప్స్(1), డారిల్ మిచెల్ (101) ఉన్నారు.

Ind Vs NZ
Team New Zealand
India
Cricket
  • Loading...

More Telugu News