Heavy Rains: చెన్నై నగరాన్ని ముంచెత్తుతున్న భారీ వర్షాలు

  • ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
  • తమిళనాడులో విస్తారంగా వర్షాలు
  • చెన్నైలో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ
  • విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్
Heavy rains lashes Chennai and other districts in Tamilnadu

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలోనూ భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. నగరంలో రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. చెన్నైలోనూ, శివారు ప్రాంతాల్లోనూ బుధవారం నాడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. 

ఇప్పటికే కారైక్కాల్, కడలూరు, విల్లుపురం, నాగపట్నం జిల్లాల్లో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. విద్యాసంస్థలు మూతపడ్డాయి. పుదుచ్చేరిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తమిళనాడు కోస్తా ప్రాంతాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

More Telugu News