Dastagiri: వివేకా హత్య కేసు: సీబీఐ కోర్టులో దస్తగిరి పిటిషన్

Dastagiri files petition in CBI Court
  • వివేకా హత్య కేసులో కీలక పరిణామం
  • వివేకా హత్య కేసులో తనను నిందితుడిగా తొలగించాలన్న దస్తగిరి
  • దస్తగిరి పిటిషన్ పై రేపు విచారణ
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన మాజీ డ్రైవర్ దస్తగిరి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వివేకా హత్య కేసులో తనను నిందితుడిగా తొలగించాలని తన పిటిషన్ లో విజ్ఞప్తి చేశాడు. కేవలం సాక్షిగా మాత్రమే పరిగణించాలని కోరాడు. గతంలో సీబీఐ చార్జిషీట్ లో తనను సాక్షిగా చేర్చిందని దస్తగిరి వివరించాడు. దస్తగిరి పిటిషన్ ను నాంపల్లి సీబీఐ కోర్టు రేపు విచారించనుంది. వివేకా హత్య కేసులో దస్తగిరి ఏ-4గా ఉన్నాడు. అయితే అప్రూవర్ గా మారిన అనంతరం అతడికి బెయిల్ లభించింది.
Dastagiri
Petition
CBI Court
YS Vivekananda Reddy

More Telugu News