AP Roads: తమిళనాడు-ఏపీ రోడ్ల మధ్య తేడాను చూపిస్తూ వీడియో షేర్ చేసిన కన్నా.. మీరూ చూడండి!

TDP leader Kanna shares difference between AP and Tamil Nadu Roads
  • ఏపీ రోడ్లపై విమర్శల వెల్లువ
  • అవకాశం చిక్కినప్పుడల్లా విమర్శలు చేస్తున్న తెలంగాణ నేతలు
  • వీడియో షేర్ చేసిన కన్నా లక్ష్మీనారాయణ
  • అచ్చం కేసీఆర్ చెప్పినట్టే ఉన్నాయన్న కన్నా
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ తెలుగుదేశం సహా విపక్షాలు రోజూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్నికల వేళ తెలంగాణలోని అధికారపార్టీ నాయకులు కూడా రాష్ట్రంలోని రోడ్లను ఏపీ రోడ్లతో పోలుస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కౌంటర్లు ఇస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

ఇక, సామాజిక మాధ్యమాల్లో అయితే ఏపీ రోడ్లపై మీమ్స్‌కు, జోక్స్‌కు కొదవలేకుండా పోయింది. తాజాగా టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఓ వీడియోను పోస్టు చేస్తూ తమిళనాడు, ఏపీ రోడ్ల మధ్య వ్యత్యాసం ఇదేనని పేర్కొన్నారు. ఆంధ్రాకు వెళ్తే సింగిల్ రోడ్డు.. తెలంగాణ వస్తే డబుల్ రోడ్డు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రా పరువు తీశారని పేర్కొన్నారు. ఆయన చెప్పింది అక్షరాలా నిజమని చెబుతూ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో తమిళనాడు నుంచి ఏపీలోకి దారితీసే రోడ్డు నున్నగా ఒక్క గతుకు కూడా లేకుండా ఉండగా.. సరిగ్గా ఏపీలోకి ప్రవేశించాక గుంతలమయంగా మారింది. అడుగుకు పది గుంతలు చొప్పున దర్శనమిచ్చాయి.
AP Roads
Tamil Nadu
Kanna Lakshminarayana
TDP
Andhra Pradesh
Telangana
Viral Videos

More Telugu News