Varun Tej: ఓటీటీలో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి వీడియో స్ట్రీమింగ్ ... అంతా వట్టిదే!

Varun Tej team condemns rumors on OTT streaming of wedding video
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ లవ్ జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లితో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి ఇటలీలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం టస్కనీలో వైభవంగా జరిగింది. అయితే, వీరి పెళ్లి వీడియోను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ప్రసారం చేయనుందని వార్తలు వచ్చాయి. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి వీడియో స్ట్రీమింగ్ కోసం నెట్ ఫ్లిక్స్ మెగా ఫ్యామిలీతో రూ.8 కోట్ల డీల్ కుదుర్చుకుందంటూ ప్రచారం జరిగింది. 

దీనిపై వరుణ్ తేజ్ టీమ్ స్పందించింది. ఇదంతా వట్టి పుకారేనని స్పష్టం చేసింది. వరుణ్ తేజ్ పెళ్లి వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, ఇలాంటి వార్తలను నమ్మవద్దని స్పష్టం చేసింది. ఇవి పూర్తిగా నిరాధారమైన వార్తలని, వీటిని వ్యాప్తి చేయవద్దని పేర్కొంది.
Go Back to Shorts
Varun Tej
Lavanya Tripathi
Wedding
OTT Streaming
Rumors
Varun Tej Team
Tollywood

More Telugu News