Sachin Tendulkar: ఆఫ్ఘన్ క్యాంప్ లో సచిన్ సందడి... ఫొటోలు ఇవిగో!

Sachin Tendulkar met Afghanistan cricketers in Mumbai

  • రేపు ముంబయిలో ఆస్ట్రేలియా × ఆఫ్ఘనిస్థాన్ 
  • ముంబయిలో సాధన చేస్తున్న ఆఫ్ఘన్ ఆటగాళ్లు
  • స్టేడియానికి వెళ్లి ఆఫ్ఘన్ ఆటగాళ్లను కలిసిన సచిన్

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మైదానంలోనే కాదు, వెలుపల కూడా తన వ్యక్తిత్వంతో ఆకట్టుకుంటాడని తెలిసిందే. వివాద రహితుడిగా పేరుగాంచిన సచిన్ ను ఇతర దేశాల క్రికెటర్లు కూడా ఎంతో అభిమానిస్తారు. తాజాగా, సచిన్ ఆఫ్ఘనిస్థాన్ జట్టును కలిశాడు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ జట్టు ముంబయిలోనే ఉంది. ఆఫ్ఘన్ జట్టు రేపు (నవంబరు 7) ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఆఫ్ఘన్ ఆటగాళ్లు ఈ మ్యాచ్ కోసం ముంబయిలో ప్రాక్టీసు చేస్తున్నారు. 

ఈ క్రమంలో ఆఫ్ఘన్ శిబిరాన్ని సచిన్ సందర్శించాడు. ఆఫ్ఘన్ ఆటగాళ్లతో కలిసి ఉత్సాహంగా ముచ్చటించాడు. వారిని పేరుపేరునా పలకరించి ఉత్తేజం నింపాడు. అంతేకాదు, ఆఫ్ఘనిస్థాన్ జట్టు కోచ్ జోనాథన్ ట్రాట్, సలహాదారు అజయ్ జడేజాలతోనూ సచిన్ ఉల్లాసంగా మాట్లాడుతూ కనిపించాడు. 

వరల్డ్ కప్ టోర్నీలో ఆఫ్ఘనిస్థాన్ 7 మ్యాచ్ లు ఆడి 4 విజయాలు సాధించింది. సెమీస్ అవకాశాలు ఊరిస్తుండడంతో ఆ జట్టు ఉత్సాహంగా ఉంది. అయితే, రేపు ఆసీస్ తో, ఈ నెల 10న దక్షిణాఫ్రికాతో ఆడాల్సి ఉండడం ఆ జట్టుకు ప్రతికూలం కానుంది. ఎందుకంటే, ఆసీస్, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లను కంగు తినిపించడం ఏమంత సులువు కాదు.

  • Loading...

More Telugu News