VarunLav: హైదరాబాదులో ఘనంగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి రిసెప్షన్... ఫొటోలు ఇవిగో!

VarunLav wedding reception held in Hyderabad in a grand style
  • ఇటీవల పెళ్లితో ఒక్కటైన టాలీవుడ్ లవ్ కపుల్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి
  • ఇటలీలోని టస్కనీలో గ్రాండ్ గా వెడ్డింగ్
  • నేడు మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో రిసెప్షన్
  • హాజరైన ప్రముఖులు
టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల భామ లావణ్య త్రిపాఠి వివాహం ఇటీవల ఇటలీలోని టస్కనీలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, నేడు హైదరాబాదులో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఈ భారీ విందు కార్యక్రమానికి వేదికగా నిలిచింది. టాలీవుడ్ తారల రాకతో రిసెప్షన్ కార్యక్రమం కళకళలాడింది. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, ఇతర కుటుంబ సభ్యులతో పాటు అలీ, మురళీమోహన్, నాగచైతన్య, దగ్గుబాటి పురందేశ్వరి, కామినేని శ్రీనివాస్, టి.సుబ్బరామిరెడ్డి, యాంకర్ సుమ, బ్యాడ్మింటన్ తార సైనా నెహ్వాల్ తదితర ప్రముఖులు విచ్చేశారు.
VarunLav
Varun Tej
Lavanya Tripathi
Reception
Wedding
Hyderabad

More Telugu News