ఏపీలో తాలిబాన్ల రాజ్యాన్ని గుర్తుకు తెస్తున్నారు: నారా లోకేశ్
- వైసీపీ ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారంటూ పోలీసులపై ఫైర్
- పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి అరాచక పాలన
- దళితులపై రాజ్యహింసను అడ్డుకోవాలంటూ లోకేశ్ పిలుపు
బహిరంగ వేదికలపై ఎస్సీ, ఎస్టీ, బీసీలపై ప్రేమను ఒలకబోసే ముఖ్యమంత్రి జగన్.. ముల్లంగి వెంకటరమణపై పోలీసుల దుశ్చర్యను ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. తమ పార్టీ దళిత నేతను అక్రమంగా నిర్బంధించిన కల్లూరు సీఐపై వెంటనే విచారణ జరిపించి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కల్లూరు సీఐపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. దళితులపై రాజ్యహింసను అడ్డుకోవాలని లోకేశ్ కోరారు.