Indian-2: "నమస్తే ఇండియా... భారతీయుడు ఈజ్ బ్యాక్"... ఇండియన్-2 తెలుగు ఇంట్రో రిలీజ్ చేసిన రాజమౌళి

  • కమల్ హాసన్, శంకర్ కాంబోలో ఇండియన్-2
  • తెలుగులో భారతీయుడు-2గా వస్తున్న భారీ చిత్రం
  • నేడు వివిధ భాషల్లో ఒక్కొక్క ప్రముఖుడితో ఇంట్రో విడుదల
Rajamouli releases Indian2 Intro video

లోకనాయకుడు కమల్ హాసన్, అగ్రశ్రేణి డైరెక్టర్ శంకర్ కలయికలో లైకా ప్రొడక్షన్స్,  రెడ్ జెయింట్ బ్యానర్‌ నుంచి వస్తున్న మరో భారీ చిత్రం ఇండియన్-2. ఈ చిత్రం తెలుగులో భారతీయుడు-2 పేరుతో వస్తోంది. తాజాగా, ఈ చిత్రం నుంచి ఇంట్రో తీసుకువచ్చారు. వివిధ భాషల్లో ఒక్కో ప్రముఖుడి చేతుల మీదుగా ఈ ఇంట్రో రిలీజ్ అయింది. తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి భారతీయుడు-2 ఇంట్రోను విడుదల చేశారు. "నమస్తే ఇండియా... భారతీయుడు ఈజ్ బ్యాక్" అంటూ కమల్ చెప్పిన డైలాగును రాజమౌళి కామెంట్ పెట్టారు. 

90వ దశకంలో వచ్చిన భారతీయుడు చిత్రానికి ఇది సీక్వెల్ కాబట్టి, ఇది కూడా అవినీతి అంతానికి సంబంధించిన సబ్జెక్టేనని అర్థమవుతుంది. ఇక ఇంట్రో చూస్తే... శంకర్ ట్రేడ్ మార్క్ భారీ పనితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. విజువల్స్ హైలెవెల్లో ఉన్నాయి. రవి వర్మన్ కెమెరా వర్క్ కు ఆడియన్స్ సాహో అనాల్సిందే. 

ఈ చిత్రంలో కమల్ హాసన్, సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జే సూర్య, బాబీ సింహా, వివేక్, ప్రియా భవానీశంకర్, బ్రహ్మానందం, సముద్రఖని, నెడుముడి వేణు, ఢిల్లీ గణేశ్, మనోబాలా, బాలీవుడ్ నటుడు గుల్షన్ గ్రోవర్ తదితరులు నటించారు. 

భారతీయుడు-2 చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, శ్రీమణి సాహిత్యం సమకూర్చారు. తాజాగా విడుదల చేసిన ఇంట్రోలో కమ్ బ్యాక్ ఇండియన్ అనే సాంగ్ బిట్ ను ప్రదర్శించారు. మొత్తమ్మీద మరోసారి మ్యాజిక్ చేసేందుకు కమల్, శంకర్ సన్నద్ధమవుతున్నారు.

లంచ‌గొండిత‌నంపై పోరాటం చేయ‌టానికి 'వీర‌శేఖ‌రన్ సేనాప‌తి' రీ ఎంట్రీ

'భార‌తీయుడు 2’ ఇంట్రో గ్లింప్స్‌ను గ‌మ‌నిస్తే.. ‘ భార‌తీయుడు’లో లంచానికి వ్య‌తిరేకంగా పోరాడిన వీర‌శేఖ‌రన్ సేనాప‌తి ఇండియాలో మ‌ళ్లీ త‌ప్పు జ‌రిగితే తాను తిరిగి వ‌స్తాన‌ని చెప్ప‌టంతో క‌థ ముగిసింది. అయితే ఇప్పుడు మ‌ళ్లీ దేశంలో లంచ‌గొండిత‌నం పెరిగిపోతోంది. లంచం లేనిదే అధికారులు ఎవ‌రూ ఏ ప‌నులు చేయ‌టం లేదు. దీంతో సామాన్యుడు బ‌త‌క‌ట‌మే క‌ష్టంగా మారింది. అప్పుడు భార‌తీయులంద‌రూ క‌మ్ బ్యాక్ ఇండియ‌న్ అంటూ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి మ‌ళ్లీ దేశంలోకి భార‌తీయుడు అడుగు పెట్టాల‌ని రిక్వెస్టులు పంపుతారు. 

చివ‌ర‌కు వీర‌శేఖ‌ర‌న్ సేనాప‌తి ఇండియాలోకి అడుగు పెడ‌తారు. వ‌చ్చిన త‌ర్వాత సేనాప‌తి ఏం చేశారు... భార‌తీయుడికి భ‌య‌ప‌డి లంచాలు మానేసిన అధికార‌లు మ‌ళ్లీ లంచాలు తీసుకోవ‌టానికి కార‌ణం ఎవ‌రు? పేట్రేగిన లంచం వ‌ల్ల దేశంలో ఎలాంటి అల్ల‌క‌ల్లోలాలు జ‌రిగాయి. అనే విష‌యాల‌ను ఈ గ్లింప్స్‌లో చాలా గ్రాండియ‌ర్‌గా చూపించారు డైరెక్ట‌ర్ శంక‌ర్‌. గ్లింప్స్‌లోనే ఈ రేంజ్ గ్రాండియ‌ర్‌నెస్ ఉంటే ఇక సినిమాలో ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 

ఇదే గ్లింప్స్‌లో క‌మ‌ల్ హాస‌న్‌తో పాటు హీరో సిద్ధార్థ్‌, ప్రియా భవానీ శంక‌ర్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహా త‌దిత‌రుల‌ను మ‌నం చూడొచ్చు. సినిమా మేకింగ్‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లిన మ‌న డైరెక్ట‌ర్ శంక‌ర్ ఈసారి భార‌తీయుడు 2 చిత్రంతో ఎలాంటి సెన్సేష‌న్స్‌కు తెర తీయ‌బోతున్నారో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందేనంటున్నారు మ‌న మేక‌ర్స్‌. ఈ ఇంట్రో గ్లింప్స్‌ను త‌మిళంలో సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌, హిందీలో మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్ ఆమిర్ ఖాన్‌, మ‌ల‌యాళంలో కంప్లీట్ యాక్ట‌ర్‌ మోహ‌న్ లాల్‌, క‌న్న‌డ‌లో కిచ్చా సుదీప్ విడుద‌ల చేశారు.


More Telugu News