VarunLav: వరుణ్ తేజ్-లావణ్యతో రామ్ చరణ్, ఉపాసన... ఫొటోలు ఇవిగో!

  • పెళ్లితో ఒక్కటైన టాలీవుడ్ లవ్ జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి
  • ఇటలీలోని టస్కనీలో గ్రాండ్ గా వెడ్డింగ్
  • మిన్నంటిన మెగా కోలాహలం
  • నెట్టింట సందడి చేస్తున్న పెళ్లి ఫొటోలు
Ram Charan and Upasana with VarunLav in Italy

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాలభామ లావణ్య త్రిపాఠిల పెళ్లి సందడి ఇంకా కొనసాగుతోంది. ఈ టాలీవుడ్ లవ్ బర్డ్స్  ఇటలీలోని టస్కనీలో పెళ్లితో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుక కోసం మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోటికి చేరడంతో హంగామా మామూలుగా లేదు. కొత్త దంపతుల పెళ్లి ఫొటోలు ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో అడుగుపెడుతున్నాయి. తాజాగా, వరుణ్ తేజ్-లావణ్యలతో రామ్ చరణ్, ఉపాసన దంపతుల ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ ఫొటోలు  వివాహం అనంతరం జరిగిన పార్టీకి సంబంధించినవని తెలుస్తోంది. నవంబరు 5న హైదరాబాదులో మెగా రిసెప్షన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ విందులో దాదాపు టాలీవుడ్ మొత్తం కనువిందు చేయనున్నట్టు సమాచారం.

More Telugu News