World Cup: వరల్డ్ కప్ లో ఇవాళ చిన్న జట్ల పోరు... గెలుపెవరిదో...!

Afghanistan takes of Nederlands on world cup league match
  • వరల్డ్ కప్ లో నేడు ఆఫ్ఘనిస్థాన్ × నెదర్లాండ్స్
  • లక్నోలో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్ 

భారత గడ్డపై గత నెల రోజులుగా జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ రసవత్తరంగా సాగుతోంది. ఈ క్రమంలో నేడు ఆఫ్ఘనిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు పోటీ పడుతున్నాయి. లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియం ఈ మ్యాచ్ కు వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన నెదర్లాండ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్ కోసం ఆఫ్ఘనిస్థాన్ జట్టులో ఒక మార్పు చోటుచేసుకుంది. పేసర్ నవీనుల్ హక్ స్థానంలో యువ స్పిన్నర్ నూర్ అహ్మద్ ను తీసుకున్నారు. పిచ్ ను దృష్టిలో ఉంచుకుని ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు నలుగురు స్పిన్నర్లతో ఆడుతుండడం విశేషం. 

అటు, నెదర్లాండ్స్ జట్టులో రెగ్యులర్ ఓపెనర్ విక్రమ్ జిత్ సింగ్ ఈ మ్యాచ్ లో ఆడడంలేదు. అతడి స్థానంలో వెస్లీ బరేసీ బరిలో దిగుతున్నాడు. 

వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో ఆఫ్ఘనిస్థాన్ ఆరోస్థానంలో ఉంది. నెదర్లాండ్స్ ఎనిమిదో స్థానంలో ఉంది. ఆఫ్ఘన్ జట్టు 6 మ్యాచ్ లు ఆడి 3 విజయాలు సాధించగా, నెదర్లాండ్స్ జట్టు 6 మ్యాచ్ లు ఆడి 2 విజయాలు నమోదు చేసింది.

  • Loading...

More Telugu News