Jagan: అక్రమాస్తుల కేసు.. సుప్రీంకోర్టులో సీఎం జగన్ కు ఎదురుదెబ్బ

Supreme Court issues notices to CBI and Jagan in Disproportionate assets case

  • జగన్ అక్రమాస్తుల కేసులో విచారణలో జాప్యం జరుగుతోందని రఘురాజు పిటిషన్
  • విచారణలో జాప్యం ఎందుకు జరుగుతోందని సీబీఐని ప్రశ్నించిన ధర్మాసనం
  • జగన్ సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యం జరుగుతోందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అంతేకాదు కేసు విచారణను హైదరాబాద్ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ ను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎన్వీఎన్ భట్టిల ధర్మాసనం విచారించింది. 

విచారణ సందర్భంగా జగన్ కేసులో విచారణ ఎందుకు ఆలస్యం అవుతోందని సీబీఐని ప్రశ్నించింది. విచారణ ఆలస్యానికి గల కారణాలు చెప్పాలంటూ సీబీఐకి నోటీసులు జారీ చేసింది. రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని ఆదేశించింది. జగన్ సహా కేసులోని ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది.

Jagan
YSRCP
Disproportionate Assets Case
Supreme Court
CBI
  • Loading...

More Telugu News