Team India: కోహ్లీ, గిల్ జోడీ అదుర్స్... భారీ స్కోరు దిశగా భారత్

Team India sails towards huge total
  • వరల్డ్ కప్ లో నేడు టీమిండియా × శ్రీలంక
  • టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్
  • 4 పరుగులకే రోహిత్ శర్మ అవుట్
  • అర్ధసెంచరీలతో కదం తొక్కిన కోహ్లీ, గిల్
  • 28 ఓవర్లలో భారత్ స్కోరు 1 వికెట్ కు 172 పరుగులు
శ్రీలంకతో మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ (4) ఆరంభంలోనే అవుటైనప్పటికీ, టీమిండియాపై ఆ ప్రభావం ఏమాత్రం పడలేదు. అందుకు కారణం... విరాట్ కోహ్లీ, ఓపెనర్ శుభ్ మాన్ గిల్! వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూనే, శ్రీలంకపై ఎదురుదాడికి దిగారు. 150 పైచిలుకు భాగస్వామ్యంతో భారత్ భారీ స్కోరుకు బాటలు వేశారు. 

ఈ మ్యాచ్ ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక... భారత్ కు బ్యాటింగ్ అప్పగించింది. 28 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 1 వికెట్ నష్టానికి 172 పరుగులు. కోహ్లీ 84, గల్ 75 పరుగులతో ఆడుతున్నారు. తొలి పవర్ ప్లేలో భారత ఆటగాళ్లు ఇచ్చిన క్యాచ్ లను శ్రీలంక ఫీల్డర్లు నేలపాలు చేశారు. ఆ తర్వాత కోహ్లీ, గిల్ జోడీని అడ్డుకోవడం లంకేయుల వల్ల కాలేదు. చూస్తుండగానే స్కోరు 100, ఆపై 150 దాటిపోయింది.
Team India
Sri Lanka
Virat Kohli
Shubman Gill
Rohit Sharma
Wankhede
Mumbai
World Cup

More Telugu News