Team India: రాణించిన ఇంగ్లండ్ బౌలర్లు... స్వల్ప స్కోరుకే పరిమితమైన టీమిండియా

Team India scores 229 runs against England

  • లక్నోలో టీమిండియా × ఇంగ్లండ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసిన టీమిండియా
  • రాణించిన రోహిత్ శర్మ, సూర్యకుమార్, కేఎల్ రాహుల్
  • 3 వికెట్లతో సత్తా చాటిన డేవిడ్ విల్లీ 

లక్నోలో ఇంగ్లండ్ తో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ లైనప్ అంచనాల మేర రాణించలేకపోయింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు మాత్రమే చేసింది. 

కెప్టెన్ రోహిత్ శర్మ (87), కేఎల్ రాహుల్ (39), సూర్యకుమార్ యాదవ్ (49) మినహా మిగతా బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. కోహ్లీ డకౌట్ కాగా, గిల్ 9, శ్రేయాస్ అయ్యర్ 4, జడేజా 8 పరుగులు చేశారు. గత కొన్ని మ్యాచ్ ల్లో దారుణ ప్రదర్శన కనబర్చిన ఇంగ్లండ్ ఇవాళ టీమిండియాపై సాధికారికంగా బౌలింగ్ చేసింది. డేవిడ్ విల్లీ 3, క్రిస్ వోక్స్ 2, అదిల్ రషీద్ 2, మార్క్ ఉడ్ 1 వికెట్ తీశారు. 

పిచ్ పై బౌన్స్, కొద్దిగా స్వింగ్ లభించడంతో తమకు అనుకూలమైన పరిస్థితుల్లో ఇంగ్లండ్ బౌలర్లు విజృంభించారు. ధాటిగా ఆడేందుకు టీమిండియా బ్యాటర్లు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. అదే సమయంలో ఇంగ్లండ్ ఫీల్డింగ్ కూడా మెరుగ్గా ఉండడంతో టీమిండియాకు కష్టాలు తప్పలేదు.

Team India
England
Lucknow
World Cup
  • Loading...

More Telugu News