Raj Kundra: జైల్లో ఆ ట్రీట్ మెంట్ తర్వాత చచ్చిపోవాలనిపించింది: రాజ్ కుంద్రా

Raj Kundra reveals what terrible treatment he had faced on day one

  • గతంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ సహయజమానిగా ఉన్న నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా
  • అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్
  • జైల్లో బట్టలు విప్పించి నగ్నంగా చెక్ చేశారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడి
  • ఆ సమయంలో బతికుండీ చచ్చినట్టే  అనిపించిందని వివరణ

ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ఒకప్పుడు వ్యాపారవేత్తగా, ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ సహ యజమానిగా ఓ వెలుగు వెలిగాడు. కానీ, ఆ తర్వాత అశ్లీల చిత్రాల ఆరోపణలతో అప్రదిష్ఠ మూటగట్టుకున్నాడు. జైలుకు కూడా వెళ్లొచ్చాడు. రాజ్ కుంద్రా జైల్లో తనకు ఎదురైన అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించారు.

జైల్లో తొలి రోజే జరిగిన సంఘటనతో చచ్చిపోవాలనిపించిందని తెలిపారు. జైలుకు వెళ్లిన మొదటి రోజు దుస్తులన్నీ విప్పేసి తనిఖీ చేశారని, నగ్నంగా ఉన్న తనను వంగోబెట్టి వెనుక భాగంలోనూ సోదా చేశారని, ఏవైనా నిషిద్ధ పదార్థాలు తీసుకువచ్చానేమోనని ఆ విధంగా తనిఖీ చేశారని రాజ్ కుంద్రా వెల్లడించారు. 

అంత దారుణమైన అనుభవం ఎదుర్కొన్నాక బతికుండీ చచ్చినట్టేననిపించిందని వాపోయారు. ఒకప్పుడు ఎంత గొప్పగా, పరువుప్రతిష్ఠలతో బతికానో గుర్తుకు వచ్చాక ఇక చనిపోవడమే మంచిదన్న ఆలోచన కూడా వచ్చిందని వివరించారు. బయట మీడియా రాసిన రాతలు సైతం తనను తీవ్రంగా కుంగదీశాయని, ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందన్న నమ్మకంతో తనకు తానే ధైర్యం చెప్పుకున్నట్టు వెల్లడించారు.

Raj Kundra
Jail
Shilpa Shetty
Bollywood
  • Loading...

More Telugu News