KTR: కాంగ్రెస్ నేతలకు మంత్రి కేటీఆర్ సవాల్

  • కర్ణాటకకు వెళ్లి రైతులను ఆరా తీద్దాం.. రెడీనా అంటూ ప్రశ్న
  • కాంగ్రెస్ నేతల ఆరోపణలపై మండిపడ్డ తెలంగాణ మంత్రి
  • కర్ణాటక రైతులు తెలంగాణకు వచ్చి ఆందోళన చేస్తున్నారని వెల్లడి
Telangana Minister KTR Challenges Congress Leader Over Karnataka Farmers Development

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలు ఇస్తోందని ఆరోపించారు. కర్ణాటకను మోడల్ గా చూపుతూ కాంగ్రెస్ నేతలు ఓట్లు అడుగుతున్నారు.. కానీ, అక్కడి రైతులేమో కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందని ఆరోపిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ను నమ్మొద్దంటూ కర్ణాటక రైతులు రాష్ట్రానికి వచ్చి మరీ ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

వారికి డబ్బులు ఇచ్చి తామే తీసుకొచ్చామని కాంగ్రెస్ ఆరోపించడం హాస్యాస్పదమని కేటీఆర్ కొట్టిపారేశారు. అందరమూ కలిసి వెళ్లి కర్ణాటకలో రైతుల పరిస్థితి ఏంటనేది ఆరా తీద్దాం.. మీరు రెడీగా ఉన్నారా? అంటూ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. మరోవైపు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని బీజేపీ ఇచ్చిన హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. ఈమేరకు హైదరాబాద్ లో శనివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News