ACB Court: సీఐడీ అధికారుల కాల్ డేటా పిటిషన్ పై 31న తీర్పు

ACB Court Reserved Judgement On CID Officers Call Data Petition

  • చంద్రబాబు అరెస్టు సమయంలో అధికారుల కాల్ డేటా ఇవ్వాలని టీడీపీ పిటిషన్
  • అధికారులు ఫోన్ లో పలువురిని సంప్రదించారని చంద్రబాబు న్యాయవాది వాదనలు
  • ఏసీబీ కోర్టులో విచారణ పూర్తి.. తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసే సమయంలో సీఐడీ అధికారుల కాల్ డేటా ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై తీర్పును ఏసీబీ కోర్టు రిజర్వ్ చేసింది. ఈ నెల 31న తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి వెల్లడించారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారులు పలువురితో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపారని టీడీపీ ఆరోపించిన విషయం తెలిసిందే.

దీంతో అధికారుల కాల్ డేటా వివరాలు కోరుతూ టీడీపీ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై చంద్రబాబు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అరెస్టు సమయంలో అధికారులు ఎవరితో సంప్రదింపులు జరిపారనే విషయం తెలిస్తే కీలక విషయాలు బయటపడతాయని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. తీర్పును రిజర్వ్ చేస్తూ, ఈ నెల 31న తీర్పు వెలువరిస్తామని చెప్పారు.

ACB Court
Chandrababu Arrest
CID Officers
Call Data
Andhra Pradesh
TDP
  • Loading...

More Telugu News