Cricket: పాయింట్ల పట్టికలో పాక్ ను కిందికి దింపిన శ్రీలంక.. లేటెస్ట్ జాబితా ఇదిగో!

Sri Lanka Jumps To Fifth Spot In Points Table After Defeating England
  • ఏడో స్థానం నుంచి ఐదుకు చేరిన శ్రీలంక జట్టు
  • ఎనిమిదేసి  పాయింట్లతో న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లు
  • నెట్ రన్ రేట్ కారణంగా మూడో స్థానంలో న్యూజిలాండ్
వరల్డ్ కప్ 2023లో శ్రీలంక జట్టు పాకిస్థాన్ ను కిందికి నెట్టేసింది.. ఏడో స్థానం నుంచి నేరుగా ఐదో స్థానానికి ఎగబాకింది. గురువారం జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై సంచలన విజయం తర్వాత శ్రీలంక నాలుగు పాయింట్లతో మెరుగుపడింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచిన ఈ జట్టుకు సెమీస్ ఆశలు సజీవంగానే ఉన్నాయని చెప్పొచ్చు. వరుస విజయాలతో పది పాయింట్లు సాధించిన భారత జట్టు పాయింట్ల పట్టికలో టాప్ లో కొనసాగుతోంది. నాలుగేసి మ్యాచ్ లలో విజయం సాధించిన న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లు ఎనిమిది పాయింట్లతో సరిసమానంగా ఉన్నాయి.

అయితే, నెట్ రన్ రేట్ కారణంగా సౌతాఫ్రికా రెండో స్థానంలో నిలవగా న్యూజిలాండ్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఆరు పాయింట్లతో ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు, ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్ లలో బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ జట్లు కేవలం ఒకే ఒక మ్యాచ్ లో గెలిచాయి. అయితే, రన్ రేట్ పరంగా మెరుగ్గా ఉన్న బంగ్లాదేశ్ పాయింట్ల పట్టికలో ఎనిమిదవ స్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానంలో ఇంగ్లాండ్ నిలిచింది. ఇక పాయింట్ల పట్టికలో నెదర్లాండ్స్ జట్టు అట్టడుగున నిలిచింది.
Cricket
World cup 2023
Sri Lanka
Pakistan
semi finals
England

More Telugu News