MS Dhoni: రోహిత్ సేన కప్ గెలుస్తుందా అన్న ప్రశ్నకు ధోనీ ఏమన్నాడంటే..!

MS Dhoni Reaction On Rohit Sharma led Indias Chances To Win Cricket World Cup Is Big

  • జట్టు కూర్పు అద్భుతంగా ఉందన్న మాజీ కెప్టెన్
  • టీమ్ లో అందరూ బాగా ఆడుతున్నారని మెచ్చుకోలు
  • తెలివైన వాళ్లకు ఈ మాత్రం హింట్ చాలంటూ వ్యాఖ్య

వరల్డ్ కప్ 2023 టోర్నీలో భారత జట్టు వరుస విజయాలతో దూసుకెళుతోంది. టోర్నీలో ఇప్పటి వరకూ ఓటమి ఎరుగకుండా పాయింట్ల పట్టికలో టాప్ లో కొనసాగుతోంది. దీంతో ఈసారి కప్పు మనదేనని అభిమానులు, మాజీ ఆటగాళ్లు నమ్ముతున్నారు. పలువురు మాజీ ఆటగాళ్లు ఇప్పటికే ఈ అభిప్రాయం వ్యక్తం చేయగా.. తాజాగా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా స్పందించాడు. ప్రస్తుతం జట్టు కూర్పు అద్భుతంగా ఉందని, జట్టులో ప్రతీ ఒక్కరూ చాలా బాగా ఆడుతున్నారని మెచ్చుకున్నాడు. 

ప్రస్తుతం ఇంతకంటే ఎక్కువగా మాట్లాడనని అంటూ.. తెలివైన వారికి ఈమాత్రం హింట్ చాలని, అర్థం చేసుకుంటారని మిస్టర్ కూల్ వ్యాఖ్యానించాడు. రోహిత్ సేన వరల్డ్ కప్ ను అందుకుంటుందని ధోనీ పరోక్షంగా చెప్పాడు. గురువారం ఓ కార్యక్రమంలో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఈ జవాబిచ్చాడు. మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని భారత జట్టు 2011 వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా 2013లో ఛాంపియన్స్ ట్రోపీని కూడా ధోని కెప్టెన్సీలోనే సాధించింది.

MS Dhoni
Rohit Sharma
Cricket World Cup
Indian Team
Team India
2023 world cup
  • Loading...

More Telugu News