Nara Lokesh: సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభం... టీడీపీ నేతలను పవన్ కు పరిచయం చేసిన లోకేశ్

Nara Lokesh introduces TDP leaders to Pawan Kalyan in Rajahmundry

  • రాజమండ్రిలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం
  • హోటల్ మంజీరాలో కొనసాగుతున్న కీలక భేటీ
  • జనసేన నేతలను పేరుపేరునా పలకరించిన లోకేశ్
  • చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని అభిప్రాయపడిన ఇరు పార్టీల నేతలు

రాజమండ్రిలో టీడీపీ, జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది. హోటల్ మంజీరా వేదికగా ఈ పొత్తు సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులను నారా లోకేశ్ జనసేనాని పవన్ కల్యాణ్ కు పరిచయం చేశారు. జనసేన సభ్యులను లోకేశ్ పేరుపేరునా పలకరించారు. కనీస ఉమ్మడి కార్యక్రమం సహా 6 అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీలన, జాబితాలో అవకతవకలపై బూత్, జిల్లా స్థాయి జేఏసీ కమిటీల ఏర్పాటుపైనా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ వివిధ సమస్యలపై ఉద్యమ కార్యాచరణ రూపొందించనుంది. 

సమావేశం ప్రారంభం కాగానే, చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ సమన్వయ కమిటీ తీర్మానం చేసింది. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని ఇరు పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు.



Nara Lokesh
Pawan Kalyan
TDP Leaders
Coordination Committee
TDP-Janasena
Rajahmundry
  • Loading...

More Telugu News