ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురు ప్రమాణ స్వీకారం.. 30కి పెరిగిన జడ్జిల సంఖ్య

AP High Court Additional Judges Swearing in Ceremony
  • ప్రమాణ స్వీకారం చేసిన హరినాథ్, కిరణ్మయి, సుమతి, విజయ్
  • విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కార్యక్రమం
  • హాజరైన హైకోర్టు సీజే, న్యాయమూర్తులు, సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన హరినాథ్ నూనెపల్లి, కిరణ్మయి మండవ, సుమతి జగడం, న్యాపతి విజయ్ కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వీరితో ప్రమాణస్వీకారం చేయించారు. హైకోర్టు సీజే, న్యాయమూర్తులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రమాణస్వీకారం చేసిన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తుల పోస్టులు ఉండగా ప్రస్తుతం 27 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో ఇద్దరు ఇతర రాష్ట్రాలకు బదిలీ కాగా, కర్ణాటక నుంచి జస్టిస్ నరేందర్ బదిలీపై ఏపీ హైకోర్టుకు వస్తున్నారు. ఇక, కొత్తగా నియమితులైన నలుగురితో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి పెరిగింది.

Advertisement
AP High Court
AP High Court Judges
Andhra Pradesh
Justice Abdul Nazeer
YS Jagan

More Telugu News