Rahul Gandhi: వారు నాపై విమర్శలు చేస్తుంటే సంతోషంగా ఉంది!: రాహుల్ గాంధీ

Rahul Gandhi in Telangana Bus yatra

  • మంథనిలో బస్సు యాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ
  • బీజేపీకి మజ్లిస్, బీఆర్ఎస్ మద్దతుగా ఉన్నాయని ఆరోపణ
  • కేసీఆర్ బీజేపీకి మద్దతిస్తున్నందువల్లే సీబీఐ, ఈడీ ఆయన వెంట పడవని వ్యాఖ్య

మజ్లిస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పాల్గొని బీజేపీకి సహకరిస్తోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. మంథనిలో నిర్వహించిన బస్సుయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఒంటరి కాదని, బీజేపీ, మజ్లిస్‌తో కలిసి అది ముందుకు సాగుతోందని ఆరోపించారు. తాను బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నానని, అందుకే తనపై ఎన్నో కేసులు పెట్టారన్నారు. తన సభ్యత్వాన్ని లాక్కున్నారని, తన ఇంటిని లాక్కున్నారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీకి మద్దతిస్తున్నారన్నారు. అందుకే ఆయన వెంట సీబీఐ, ఈడీలు పడవన్నారు.

బీజేపీతో పోరాడుతున్నానని నిరంతరం తన డీఎన్ఏ గుర్తు చేస్తోందని, బీజేపీకి మద్దతిచ్చేవారు తనపై విమర్శలు చేస్తోంటే తన పోరాటం సవ్యంగా సాగుతోందని అర్థమవుతోందన్నారు. అది తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగుతుందని, ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. కులగణన ఎక్స్‌రే వంటిదన్నారు. అందుకే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్స్‌రే అంటే కులగణన చేయిస్తామన్నారు.

  • Loading...

More Telugu News