Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే న్యూస్!

  • ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లో తారక్ కు చోటు
  • తారక్ తో పాటు మరో నలుగురికి దక్కిన గౌరవం
  • యంగ్ టైగర్ పై వెల్లువెత్తుతున్న ప్రశంసలు
Junior NTR gets place in Oscars Actors Branch

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిభ కలిగిన నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో తారక్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఈ సినిమా ముందు వరకు కు తారక్ గురించి ఉత్తరాది వారికి పెద్దగా తెలియదు. కానీ, ఒకే ఒక్క సినిమాతో ఉత్తరాదితో పాటు ప్రపంచ వ్యాప్తంగా తారక్ అభిమానులను సంపాదించుకున్నాడు. గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మరో ఘనతను సాధించాడు. 

ప్రతిష్ఠాత్మక 'ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్'లో తారక్ కు చోటు లభించింది. 'ది అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్' కొత్త మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్ లో తారక్ కు స్థానం కల్పించింది. ఈ ఏడాదికి గాను ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లో ప్రపంచ వ్యాప్తంగా ఐదుగురు నటులకు చోటు దక్కింది. వీరిలో తారక్ తో పాటు కే హుయ్ క్వాన్, కెర్రీ కాండన్, రోసా సలాజర్, మార్షా స్టెఫానీ బ్లేక్ ఉన్నారు. అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న తారక్ పై టాలీవుడ్ తో పాటు దేశంలోని ఇతర సినీ పరిశ్రమల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తారక్ అభిమానుల ఆనందం అంబరాన్ని అంటుతోంది.

More Telugu News