Car explosion: గాజాను వీడుతున్న కారులో అకస్మాత్తుగా భారీ పేలుడు.. షాకింగ్ వీడియో ఇదిగో!

Horrifying moment car trying to escape Gaza via safe route EXPLODES
  • గాజాపై ఇజ్రాయెల్ భూతల దాడులు
  • భారీ సంఖ్యలో గాజాను విడిచిపోతున్న సామాన్యులు
  • సురక్షిత మార్గం గుండా వెళుతున్న ఓ కారులో అకస్మాత్తుగా పేలుడు
  • సామాన్యులపై కూడా దాడులు జరుగుతున్నాయంటూ పాలస్తీనా వాసుల ఆగ్రహం

సురక్షిత మార్గం మీదుగా గాజాను వీడుతున్న ఓ కారు ఇటీవల అకస్మాత్తుగా పేలిపోవడం కలకలం రేపుతోంది. సామాన్యులపై కూడా ఇజ్రాయెల్ దాడులు జరుపుతోందంటూ పాలస్తీనా వాసులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

గాజాలో భూతల దాడులకు తెరదీసిన ఇజ్రాయెల్ సైన్యం అక్కడి పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో, ప్రజలు పెద్ద ఎత్తున గాజాను వీడుతున్నారు. సురక్షిత మార్గాలుగా పేరు పడ్డ సలాహ్ అల్ దిన్ హైవే, మరో తీర ప్రాంత రహదారి మీదుగా ప్రజలు తరలిపోతున్నారు. ఈ క్రమంలో సలాహ్ అల్ దిన్ హైవేపై వెళుతున్న ఓ కారు అకస్మాత్తుగా పేలిపోవడం సంచలనం కలిగించింది. కారుపై బాంబు దాడి జరిగి ఉండొచ్చని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు. కారు పేలుడుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది.

  • Loading...

More Telugu News