Khushbu: మీరు బ్లూఫిలిమ్స్ చూస్తారు కదా.. దమ్ముంటే రోజాది బయటపెట్టండి: మరోసారి ఖుష్బూ సవాల్

Khushboo agains lashes out at Bandaru Satyanarayana
  • బ్లూఫిలిమ్స్ చూసే దిగజారుడు వ్యక్తి ఓ మహిళను అలా మాట్లాడటం సిగ్గుచేటన్న ఖుష్బూ
  • అన్నిచోట్లా రాజకీయాల్లో మహిళలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్న నటి
  • బండారు ముందు తరాల వారికి ఏం సందేశం ఇస్తున్నారని నిలదీత
మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలపై నటి ఖుష్బూ మరోసారి స్పందించారు. రోజాకు సంబంధించిన బ్లూఫిల్మ్ ఉందని బండారు చెప్పారని, అంటే ఆయన బ్లూ ఫిల్మ్ చూస్తున్నారని అర్థం చేసుకోవచ్చునని, అలాంటి దిగజారుడు వ్యక్తి ఒక మహిళను అలా మాట్లాడ్డం సిగ్గుచేటన్నారు. మొత్తంగా ఒక మనిషిగా ఆయన ఓడిపోయారన్నారు. రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు.

కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాకుండా దేశంలో అన్నిచోట్లా రాజకీయాల్లో మహిళలు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్నారు.  ఒక మహిళ గురించి అంత అసహ్యంగా మాట్లాడి ముందుతరాల వారికి ఎలాంటి సందేశాలు ఇస్తున్నారో చెప్పాలన్నారు. మహిళల క్యారెక్టర్‌ను చంపేలా మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదన్నారు. రోజా బ్లూఫిలిమ్స్ ఉన్నాయని చెప్పిన బండారు దమ్ముంటే ఆ వీడియోను రిలీజ్ చేయాలన్నారు.
Khushbu
Roja
Andhra Pradesh

More Telugu News