Chandrababu: చంద్రబాబు ఆరోగ్యంపై రాజమండ్రి జైలు డిప్యూటీ సూపరింటిండెంట్ వివరణ

Chandrababu health bulletin details

  • కొన్నిరోజులుగా విపరీతమైన ఉక్కపోత, అధిక వేడిమి
  • డీహైడ్రేషన్, అలర్జీతో బాధపడుతున్న చంద్రబాబు
  • స్కిన్ స్పెషలిస్టులను పిలిపించామన్న జైలు ఉన్నతాధికారి
  • చంద్రబాబుకు అలర్జీ సమస్య ఉందని వైద్యులు గుర్తించారని వెల్లడి 

టీడీపీ అధినేత చంద్రబాబు జైలులో అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. విపరీతమైన ఉక్కపోత, అధిక వేడిమి కారణంగా ఆయన డీహైడ్రేషన్ బారినపడ్డారు. దాంతోపాటే అలర్జీకి గురయ్యారు. ప్రస్తుతం ఆయన స్కిల్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. 

చంద్రబాబు అనారోగ్యానికి లోనవడం పట్ల జైలు డిప్యూటీ సూపరింటిండెంట్ రాజ్ కుమార్ స్పందించారు. తనకు అలర్జీ సమస్య ఉందని చంద్రబాబు చెప్పడంతో, స్కిన్ స్పెషలిస్టులను పిలిపించామని వెల్లడించారు. వైద్యులు చంద్రబాబును పరీక్షించారని, చంద్రబాబుకు అలర్జీ సమస్య ఉందని వారు గుర్తించారని రాజ్ కుమార్ తెలిపారు. చంద్రబాబుకు కొన్ని మందులు సూచించారని, వైద్యులు సూచించిన మందులను చంద్రబాబుకు అందిస్తామని చెప్పారు. ఆ మేరకు చంద్రబాబు హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు.

Chandrababu
Health Bulletin
Allergy
Rajahmundry Jail
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News