Virat Kohli: కోహ్లీ 50వ సెంచరీ కొట్టాకే పెళ్లి చేసుకుంటా... ఓ అభిమాని ప్లకార్డు ప్రదర్శన

Fan displays a placard about his marriage linked with Kohli 50th ODI ton

  • నేడు వరల్డ్ కప్ లో టీమిండియా, ఆఫ్ఘనిస్థాన్ ఢీ
  • ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్
  • స్టేడియంలో కెమెరాల దృష్టిని ఆకర్షించిన అభిమాని ప్లకార్డు
  • ప్రస్తుతం వన్డేల్లో 47 సెంచరీలు సాధించిన కోహ్లీ

ఇవాళ ఢిల్లీలో టీమిండియా, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతోంది. ఈ సందర్భంగా, మ్యాచ్ కు వేదికగా నిలుస్తున్న అరుణ్ జైట్లీ స్టేడియంలో ఓ ప్రేక్షకుడు ప్రదర్శించిన ప్లకార్డు కెమెరాల దృష్టిని ఆకర్షించింది. "కింగ్ కోహ్లీ వన్డేల్లో 50వ సెంచరీ సాధించిన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటా" అని ఆ ప్లకార్డుపై రాసి ఉంది. 

తన అమోఘమైన బ్యాటింగ్ విన్యాసాలతో కోహ్లీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. కోహ్లీ తన ఫ్యాన్స్ పట్ల ఎంతో గౌరవం చూపిస్తుంటాడు. స్టేడియం వద్ద, ఇతర ప్రదేశాల్లో అభిమానులను కలుసుకుని, వారితో ఫొటోలకు పోజులిస్తుంటాడు. 

కోహ్లీ ఇప్పటివరకు 282 వన్డేలు ఆడి 47 సెంచరీలు బాదాడు. 50కి మరో మూడు సెంచరీల దూరంలో ఉన్నాడు. కోహ్లీ ఫామ్ లో ఉన్న నేపథ్యంలో, సదరు అభిమాని పెళ్లి కోసం ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన పనిలేదని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. కోహ్లీ ఆ మూడు సెంచరీలను కూడా ఈ వరల్డ్ కప్ లోనే సాధిస్తాడన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

Virat Kohli
50th Ton
Fan
Marriage
Placard
New Delhi
Team India
Afghanistan
  • Loading...

More Telugu News