Prabhas: ప్రభాస్ బర్త్ డే రోజునే 'సలార్' ట్రైలర్!

  • బొగ్గు గనుల నేపథ్యంలో సాగే 'సలార్'
  • ప్రభాస్ జోడీగా అలరించనున్న శ్రుతి హాసన్
  • ప్రత్యేక ఆకర్షణగా రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్  
  • ఫస్టు పార్టు డిసెంబర్ 22వ తేదీన విడుదల
Salaar Movie Update

ప్రభాస్ అభిమానులంతా ఇప్పుడు 'సలార్' కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో, బొగ్గు గనుల నేపథ్యంలో నడిచే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఫస్టు పార్టును డిసెంబర్ 22వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ సినిమా విడుదలకి ఇంకా రెండు నెలల వరకూ సమయం ఉంది. అందువలన ఇక ప్రమోషన్స్ మొదలుపెట్టాలని ఈ సినిమా టీమ్ భావిస్తోందని అంటున్నారు. ఈ నెల 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

మాస్ ఆడియన్స్ ఆశించినట్టుగానే ఈ సినిమాలో ప్రభాస్ కనిపించనున్నాడు. ఆయన సరసన శ్రుతి హాసన్ అందాల సందడి చేయనుంది. ఒక కీలకమైన పాత్రలో మలయాళ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్ కనిపించనున్నాడు. రవి బస్రూర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు.

More Telugu News