Mumbai: పోలీసుల నుంచి సినీఫక్కీలో తప్పించుకున్న ఆఫ్రికా జాతీయుడు! వీడియో ఇదిగో

African national caught during drug raids escapes from police video goes viral

  • ముంబై నగరంలో ఇటీవల వెలుగు చూసిన ఘటన
  • మాదకద్రవ్యాల అమ్మకాలపై పోలీసుల ఉక్కుపాదం
  • శుక్రవారం ఉల్వేనోడ్ ప్రాంతంలో ఆకస్మిక సోదాలు
  • పోలీసులకు చిక్కిన ఓ ఆఫ్రికా నిందితుడు అకస్మాత్తుగా పరార్

ముంబైలో ఓ ఆఫ్రికా జాతీయుడు పోలీసులకు ఊహించని షాకిచ్చాడు. ఓ డ్రగ్స్ కేసులో అతడిని అరెస్టు చేసి బయటకు తీసుకొస్తుండగా అకస్మాత్తుగా వారి నుంచి తప్పించుకున్నాడు. అతడిని వెంబడించే క్రమంలో ఓ పోలీసు బొక్కబోర్లా పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 

మాదకద్రవ్యాల వ్యాప్తి నిరోధానికి ముంబై పోలీసులు ఇటీవల కాలంలో పలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు శుక్రవారం నగరంలోని ఉల్వేనోడ్ ప్రాంతంలో పలు చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో నైజీరియాకు చెందిన జూలియస్ ఓ ఆంథొనీ అనే నైజీరియా దేశస్థుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ.70.6 లక్షల విలువైన మెఫెడ్రోన్, రూ.14.25 లక్షల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. 

ఈ క్రమంలో మొత్తం 14 మంది విదేశీయులు అక్రమంగా నివసిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కొందరిని అరెస్టు చేసి తరలిస్తుండగా వారిలో ఒకరు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. దీంతో, అక్కడున్న పోలీసులు అతడిని వెంబడించారు. ఈ క్రమంలో వారిలో ఒకరు కింద పడిపోయారు. అయితే, పారిపోయిన నిందితుడు పోలీసులకు చిక్కాడా? లేదా? అనేది ఇంకా తెలియరాలేదు.

Mumbai
Maharashtra
Crime News
  • Loading...

More Telugu News