Nara Lokesh: బండారు సత్యనారాయణమూర్తిని టెర్రరిస్టులా అరెస్ట్ చేశారు: నారా లోకేశ్

Nara Lokesh reacts to Bandaru Sathyanarayana Murthy arrest
  • సీఎం జగన్, మంత్రి రోజాపై వ్యాఖ్యలు చేశారంటూ బండారు అరెస్ట్
  • బూతు కూతలు వద్దని హితవు పలికిన బండారును అరెస్ట్ చేశారన్న లోకేశ్
  • వైసీపీకి ఓ చట్టం, విపక్షాలకు మరో చట్టమా? అంటూ ఆగ్రహం 
టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. బూతు కూతలు వద్దని హితవు పలికిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు ఓ టెర్రరిస్టులా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ముఖ్యమంత్రి, మంత్రులు, ఆ పార్టీ నేతలు కూసే రోత బూతు కూతలపై ఎన్ని వేల కేసులు నమోదు చేయాలి? అని లోకేశ్ ప్రశ్నించారు. వైసీపీకి ఓ చట్టం, విపక్షాలకు మరో చట్టమా... ఇదేం అరాచక పాలన? అని నిలదీశారు.
Nara Lokesh
Bandaru Sathyanarayana Murthy
Arrest
TDP
YSRCP

More Telugu News