Roja: చంద్రబాబు, నారా భువనేశ్వరి దీక్షపై మంత్రి రోజా స్పందన

Roja responds on Chandrababu and Bhuvaneswari protests
  • స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • ఇవాళ గాంధీ జయంతి... జైల్లో ఒక్కరోజు దీక్ష చేపట్టిన చంద్రబాబు
  • రాజమండ్రిలో నారా భువనేశ్వరి దీక్ష
  • ఏదో త్యాగం చేసినట్టు దీక్ష చేస్తున్నారన్న రోజా
రాజమండ్రి జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, రాజమండ్రిలో నారా భువనేశ్వరి ఇవాళ ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ క్రీడలు, పర్యాటకం, యువజన వ్యవహారాల మంత్రి రోజా స్పందించారు. 

ఏదో త్యాగం చేసినట్టు చంద్రబాబు, భువనేశ్వరి దీక్ష చేస్తున్నారని విమర్శించారు. వారికి ప్రజల నుంచి సానుభూతి దక్కదని అన్నారు. చంద్రబాబుది హింసా మార్గమని అందరికీ తెలుసని, ఎన్టీఆర్ నుంచి ముద్రగడ వరకు వేధించిన సంస్కృతి చంద్రబాబు సొంతమని అన్నారు. చంద్రబాబు దొంగ దీక్షను ఎవరూ పట్టించుకోవడంలేదని రోజా వ్యాఖ్యానించారు. 

చంద్రబాబు గాడ్సే కంటే ఘోరమైన వ్యక్తి అని, ఇవాళ గాంధీ మహాత్ముడ్ని అవమానించేందుకు దీక్ష చేస్తున్నారని విమర్శించారు. 

ఇక, టీడీపీ నేత బండారు సత్యనారాయణపైనా రోజా మండిపడ్డారు. టీడీపీ నేతలు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఓ మహిళా మంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని, అతడి తల్లిదండ్రుల పెంపకం ఎలాంటిదో అతడి వ్యాఖ్యలే చెబుతున్నాయని బండారుపై విమర్శనాస్త్రాలు సంధించారు.
Roja
Chandrababu
Nara Bhuvaneswari
Protest
Rajahmundry
YSRCP
TDP

More Telugu News