Maheera Khan: ప్రియుడిని రెండో వివాహం చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్

  • ప్రియుడు సలీమ్ ను పెళ్లాడిన పాకిస్థాన్ హీరోయిన్ మహీరా ఖాన్
  • షారుఖ్ ఖాన్ 'రయీస్' చిత్రంలో నటించిన మహీరా
  • ఎంతో క్రేజ్ వచ్చినా మరే ఇండియన్ మూవీలో నటించని వైనం
Actress Mahira Khan secong marriage

పాకిస్థాన్ హీరోయిన్ మహీరాఖాన్ బాలీవుడ్ లో ఒక సినిమాలో నటించింది. షారుక్ ఖాన్ చిత్రం 'రయీస్'లో ఆమె మెరిసింది. ఈ సినిమాతో ఆమెకు ఎంతో పాప్యులారిటీ వచ్చింది. అయినప్పటికీ... ఆ తర్వాత మరే ఇండియన్ మూవీలో ఆమె నటించలేదు. ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకుంది. అనంతరం కొన్ని కారణాల వల్ల ఆమె తన భర్తకు దూరమయింది. తాజాగా సలీమ్ కరీమ్ అనే వ్యాపారవేత్తను ఆమె రెండో పెళ్లి చేసుకుంది. కొంత కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. వివాహ వేడుకలో తనవైపు నడుచుకుంటూ వస్తున్న మహీరాను చూసి సలీమ్ తీవ్ర భావోద్వేగానికి గురై, ఆమెను హత్తుకుని, కంటతడి పెట్టుకున్నాడు. ఆమెకు ముద్దు పెట్టి ఆనంద బాష్పాలు రాల్చాడు.

More Telugu News