healthy heart: గుండె ఆరోగ్యం కోసం ప్రముఖ హృద్రోగ నిపుణుడి టిప్స్!

tips for a healthy heart Carbohydrate is the next villain not oil

  • రోజూ 8,000 అడుగులు నడవాలి
  • 30 ఏళ్లు దాటితే ప్రివెంటివ్ హెల్త్ చెక్ అవసరం
  • రోజూ 15 నిమిషాలు యోగా చేస్తే అద్భుత ఫలితాలు
  • ఏడాదికోసారి ముందస్తు పరీక్షలు చేయించుకోవాలంటున్న డా. దేవిశెట్టి 

కిడ్నీలు, ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతింటే కొన్నేళ్లపాటు జీవించొచ్చు. కానీ, గుండెకు ఆపద వస్తే ఎక్కువ కాలం జీవించడం కష్టం. అది హార్ట్ ఎటాక్ గా మారితే ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది. బలమైన గుండె కోసం ఏం చేయాలన్నది నారాయణ హెల్త్ చైర్మర్, ఎండీ డాక్టర్ దేవి ప్రసాద్ శెట్టి ఓ వార్తా సంస్థకు వివరించారు. ఇప్పుడు ఆ వివరాలను ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం.

గుండె ఆరోగ్యంగా..
‘‘గుండె బద్దలయ్యే వరకు వేచి చూడొద్దు. సమస్య రాక ముందే వైద్యుడిని సంప్రదించాలి. దీన్ని నివారణ విధానమని చెబుతాం. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ప్రివెంటివ్ చెకప్ కోసం వెళ్లాలి. ముఖ్యంగా పరుగు పందెం, ఫుట్ బాల్ తదితర కఠిన శ్రమతో కూడుకున్న క్రీడల్లో పాల్గొనే ముందు స్క్రీనింగ్ అవసరం. గుండె గురించి పూర్తి స్థాయి పరిశీలన చేయించుకోవాలి. వయోజనుల్లో 15 శాతం మందిలో గుండె జబ్బులు ఉంటున్నాయి. వీరిలో 50 శాతం ఇస్చెమియాతో బాధపడుతున్నారు. అంటే హార్ట్ ఎటాక్ వచ్చినా కానీ అది వారికి తెలియదు. 

ప్రతి ఒక్కరూ స్మార్ట్ వాచ్ ధరించి, రోజూ 8,000-10,000 అడుగుల వరకు నడవండి. దీనివల్ల ఆరోగ్యంపై అద్భుతమైన ప్రభావం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదయం లేదా సాయంత్రం నడవాల్సిన అవసరం లేదు. రోజంతా నడుస్తూనే ఉండండి. ఎక్కువ మంది మొబైల్ పై అధిక సమయం వెచ్చిస్తున్నారు. హెడ్ ఫోన్ కనెక్ట్ చేసుకుని ఫోన్ ను పాకెట్ లో వేసుకుని నడవండి. స్మార్ట్ వాచ్ లో ఎన్ని అడుగులు నడిచిందీ కౌంట్ చేయండి. నడవడం అన్నది ఆరోగ్యానికి, గుండెకు ఎంతో అవసరం. 

ఇక కూర్చుని పనిచేయడం మరొక హానికర అలవాటు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి లేచి రెండు మూడు నిమిషాలు వాక్ చేసి కూర్చోవాలి. కూర్చునే భంగిమ కూడా సరిగ్గా ఉండాలి. నేడు చాలా వరకు వెన్ను నొప్పి, మెడ నొప్పి, కాలు నొప్పి అనేవి కూర్చునే భంగిమ సరిగ్గా లేకపోవడం వల్లే వస్తున్నాయి. సరైన భంగిమ ఏదన్నది ఇంటర్నెట్ సాయంతో తెలుసుకోండి. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ యోగా చేయాలి. రోజూ 10-15 నిమిషాలు చేసినా జీవితంపై అద్భుతమైన ఫలితం చూపిస్తుంది. సిగరెట్ మానివేయాలి. బరువు చెక్ చేసుకోవాలి. ఇంట్లో బరువు చూసుకునే మెషిన్ ఉండాలి. నేటి విలన్ నూనె కాదు, కార్బోహైడ్రేట్స్. కార్బో హైడ్రేట్లను తగ్గించుకోవాలి. అంటే రైస్, చపాతీని తగ్గించి తినాలి. వీలైతే ఆధ్యాత్మికంగా ఉండాలి. 

40 తర్వాత చెకప్ లు
ఉదయమే పరగడుపుతో ఏదైనా డయాగ్నోస్టిక్స్ లేదా హాస్పిటల్ కు వెళ్లి రక్త నమూనా ఇవ్వండి. బ్లడ్ షుగర్, థైరాయిడ్, సీబీపీ తదితర ప్రాథమిక పరీక్షలు అన్నీ చేయించుకోవాలి. ఆ తర్వాత ఈసీజీ తీయించుకోవాలి. ఛాతీ ఎక్స్ రే, పొట్టకు అల్ట్రా సౌండ్ పరీక్షలు చేయించుకోవాలి. 40 ఏళ్ల తర్వాత గుండెకు సంబంధించి క్యాల్షియం స్కోరు టెస్ట్ చేయించుకోవాలి. అది పాజిటివ్ వస్తే సీటీ యాంజియో చేయించుకోవాలి. ఇవన్నీ చేయించుకుంటే, వచ్చే 365 రోజుల్లో ఆరోగ్యపరంగా ఎలాంటి పెద్ద విపత్తు రాదని గ్యారంటీగా చెప్పవచ్చు’’ అని దేవి ప్రసాద్ శెట్టి వివరించారు.

healthy heart
tips
Carbohydrate
oil
Dr Devi Prasad Shetty
  • Loading...

More Telugu News