Tirumala: తిరుమలలో తగ్గిన రద్దీ.. వెయిటింగ్ లేకుండా నేరుగా శ్రీవారి సర్వదర్శనం!

Olny one hour for Tirumala Srivari sarva darshanam
  • గంట వ్యవధిలోనే భక్తులకు శ్రీవారి సర్వదర్శనం
  • చివరి రోజుకు చేరుకున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు
  • ఈ ఉదయం పుష్కరిణిలో శ్రీవారికి చక్రస్నానాన్ని నిర్వహించిన అర్చకులు
తిరుమలలో ఈరోజు భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి వెయిటింగ్ లేకుండా, భక్తులను నేరుగా ఆలయంలోకి పంపిస్తున్నారు. కేవలం ఒక గంట వ్యవధిలోనే భక్తులకు సర్వదర్శనం ద్వారా స్వామి వారి దర్శనం లభిస్తోంది. చాలా కాలం తర్వాత ఇంత సులువుగా స్వామి వారి దర్శనం లభిస్తుండటంతో భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

మరోవైపు నిన్న శ్రీవారిని 72,137 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారి హుండీకి రూ. 3.37 కోట్ల ఆదాయం వచ్చింది. ఈరోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. చివరి రోజున శ్రీవారికి పుష్కరిణిలో అర్చకులు శాస్త్రోక్తంగా చక్రస్నానాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆలయ ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ రాత్రి ధ్వజావరోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. అక్టోబర్ 15న తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లను చేస్తోంది.
Tirumala
Brahmotsavalu
Rush

More Telugu News