UK: 2030 నాటికి ధూమపాన రహిత దేశంగా బ్రిటన్.. సిగరెట్లపై నిషేధం

Rishi Sunak likely to ban cigarettes in bid to make UK smoke free
  • నవతరాన్ని ధూమపానానికి దూరంగా ఉంచాలని నిర్ణయం
  • 2009 జనవరి 1 తర్వాత జన్మించిన వారికి సిగరెట్లు అమ్మకుండా నిషేధం
  • విధివిధానాల రూపకల్పనకు సమాయత్తం
  • గతేడాది న్యూజిలాండ్ కూడా నిషేధం
నవతరాన్ని ధూమపానానికి దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో సిగరెట్లపై నిషేధం విధించాలని బ్రిటన్ ప్రభుత్వం భావిస్తోంది. 2009 జనవరి ఒకటో తేదీ తర్వాత జన్మించిన వారికి సిగరెట్లు అమ్మకుండా నిషేధం విధించాలని రిషి సునాక్ ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో న్యూజిలాండ్ గతేడాది తీసుకొచ్చిన లాంటి విధానాలనే అమలు చేయాలని నిర్ణయించింది. అక్కడ కొన్ని ప్రత్యేకమైన దుకాణాల్లో మాత్రమే సిగరెట్లను విక్రయిస్తున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వినియోగదారుడ్ని లక్ష్యంగా చేసుకుని విధానాల రూపకల్పనకు రెడీ అవుతోంది.  

‘‘2030 నాటికి ధూమపాన రహిత దేశంగా మార్చేలా మరింతమందిని ప్రోత్సహించాలనుకుంటున్నాం. అందులో భాగంగా ధూమపాన రేటును తగ్గించేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నాం’’ అని బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. గర్భిణులు ధూమపానాన్ని విడిచిపెట్టేలా ప్రోత్సహించే ఉచిత వేప్ (పొగపీల్చేందుకు ఉపయోగించే గొట్టం) కిట్‌ల వోచర్ పథకం కూడా ప్రభుత్వం తీసుకునే చర్యల్లో ఉండనుంది.
UK
Rishi Sunak
Cigarettes Ban
Britain

More Telugu News