Rashtrapati Bhavan: ఏసీబీ కోర్టు న్యాయమూర్తిపై దుష్ప్రచారం.. రాష్ట్రపతి భవన్ నుంచి ఏపీ సీఎస్ కు ఆదేశాలు!

Rashtrapati Bhavan secretary letter to AP CS

  • జడ్జి హిమబిందుపై అసత్య ప్రచారంపై విచారణకు ఆదేశం
  • కించపరిచేలా పోస్టులు పెడుతున్న వారిపై చర్యలకు ఆర్డర్
  • రాష్ట్రపతి భవన్ కార్యదర్శి పీసీ మీనా లేఖ

విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సత్య వెంకట హిమబిందుపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై రాష్ట్రపతి భవన్ స్పందించింది. సోషల్ మీడియాలో జడ్జిని కించపరిచేలా పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రపతి భవన్ కార్యదర్శి పీసీ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. 

తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు నిందితుడిగా ఉన్న ‘స్కిల్ స్కాం’ కేసును ఏసీబీ కోర్టు జస్టిస్ హిమబిందు విచారిస్తున్నారు. ఈ కేసులో చంద్రబాబును రిమాండ్ కు పంపిస్తూ న్యాయమూర్తి హిమబిందు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జడ్జి హిమబిందును కించపరిచేలా సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపేందుకు చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు న్యాయవాది రామానుజం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు.

దీనిపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం.. ఏపీ సీఎస్ కు శనివారం లేఖ రాసింది. జడ్జిపై తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్న వారిని గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించింది. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారుడు రామానుజానికి వివరించాలని పీసీ మీనా సూచించారు.

  • Loading...

More Telugu News