Varanasi Cricket Stadium: వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.. శంకుస్థాపన చేయనున్న మోదీ.. ఎన్ని ప్రత్యేకతలో!

 PM Modi to lay foundation stone of international cricket stadium in Varanasi

  • గంజారిలో 30 వేల సీట్ల సామర్థ్యంతో నిర్మాణం
  • కాశీ క్షేత్ర సారాన్ని ప్రతిబింబించేలా స్టేడియం
  • ఉత్తరప్రదేశ్‌లో మూడోది

దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలోని గంజారిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రూపుదిద్దుకోబోతోంది. తన పార్లమెంటు నియోజకవర్గమైన ఇక్కడ స్టేడియం నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మహిళా ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. పార్లమెంటులో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడతారు.

మధ్యాహ్నం 1.30 గంటలకు మోదీ వారణాసి చేరుకుంటారు. కొత్తగా నిర్మించిన 16 అటల్ రెసిడెన్షియల్ స్కూళ్లను కూడా ప్రారంభిస్తారు. క్రికెట్ స్టేడియం శంకుస్థాపన కార్యక్రమానికి బీసీసీఐ చీఫ్ రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్వి జై షా హాజరవుతారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్, లక్నోలో ఇప్పటికే రెండు క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి. ఇది మూడోది కానుంది. 

క్రికెట్ స్టేడియం విశేషాలు
* స్టేడియం నిర్మాణానికి అవసరమైన భూమి కోసం రూ. 121 కోట్లు ఖర్చు చేశారు.
* నిర్మాణానికి దాదాపు రూ.330 కోట్లు ఖర్చు చేయనున్నారు.  
* స్టేడియం సీట్ల సామర్థ్యం 30 వేలు
* స్టేడియంపైకప్పు అర్ధ చంద్రాకారంలో, ఫ్లడ్‌లైట్లు త్రిశూలం, కొన్ని నమూనాలను బిల్వ పత్రాలను పోలి వుండేలా నిర్మిస్తారు. అలాగే, ఓ నిర్మాణాన్ని డమరుకం ఆకారంలో నిర్మించనున్నారు. 
* మొత్తంగా ఈ స్టేడియం కాశీ క్షేత్ర సారాన్ని ప్రతిబింబిస్తుంది. 
* డిసెంబరు 2025 నాటికి పూర్తవుతుంది.

  • Loading...

More Telugu News