KTR: ప్రగతి భవన్‌లో మట్టి గణపతి... కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన సీఎం కేసీఆర్

KCR and KTR puja at Pragathi Bhavan ganesh
  • ప్రగతి భవన్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
  • ప్రజలకు సుఖశాంతులు అందించాలని ప్రార్థించిన కేసీఆర్
  • పూజలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు సుమన్, జీవన్ రెడ్డి
వినాయక చవితి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన అధికారిక నివాసంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రగతి భవన్‌లో చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇక్కడ మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. పూజలో కేసీఆర్, శోభ దంపతులతో పాటు మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు సుఖశాంతులు అందించాలని సీఎం కేసీఆర్ విఘ్నేశ్వరుడిని కోరుకున్నారు. పూజా కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More Telugu News

KTR
KCR
Vinayaka Chavithi
Telangana