Chiranjeevi: మనవరాలితో కలిసి చిరంజీవి తొలి వినాయకచవితి పూజ.. ఫోటోలు ఇవిగో

Chiranjeevi Vinayaka Chavithi pooja with grand daughter Klin Kaara

  • నేడు గణేశ్ చతుర్థి
  • చిరంజీవి ఇంట పండుగ శోభ
  • క్లీంకారను కూడా వినాయకుడి పూజలోకి తీసుకువచ్చిన మెగా ఫ్యామిలీ
  • అందరికీ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్

ఇవాళ వినాయకచవితి సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట పండుగ శోభ వెల్లివిరిసింది. అయితే ఈసారి చిరంజీవి నివాసంలో వినాయకచవితి పండుగకు ఓ ప్రత్యేకత ఉంది. చిరంజీవి తన మనవరాలు క్లీంకారతో కలిసి తొలి వినాయకచవితి వేడుకలు జరుపుకోవడం విశేషం. దీనిపై ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. 

అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్థిస్తున్నానని చిరంజీవి పేర్కొన్నారు. ఈసారి ప్రత్యేకత... చిన్నారి క్లీంకారతో కలిసి తొలి వినాయకచవితి జరుపుకోవడం అని వెల్లడించారు. 

దీనికి సంబంధించిన ఫొటోలను కూడా చిరంజీవి పంచుకున్నారు. మెగా ఇంట గణేశుడి పూజలో చిరంజీవి తల్లి అంజనాదేవి, అర్ధాంగి సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, శ్రీజ తదితరులు పాల్గొన్నారు.

Chiranjeevi
Vinayaka Chavithi
Klin Kaara
Ram Charan
Upasana
Mega Family
  • Loading...

More Telugu News