Brazil: కూలిన విమానం.. 14 మంది దుర్మరణం

Brazilian plane crash killing all 14 members aboard

  • బ్రెజిల్‌లోని అమెజోనాస్ రాష్ట్రంలోగల బార్సెలోస్ పరిసరాల్లో కూలిన విమానం
  • ప్రమాద సమయంలో విమానంలో 12 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది
  • ఈ ప్రమాదంలో అంతా మరణించినట్టు స్థానిక మీడియా వెల్లడి

బ్రెజిల్‌లో శనివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది అంతా దుర్మరణం చెందారు. మొత్తం 14 మంది మరణించినట్టు గవర్నర్ విల్సన్ లీమా సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. అమజోనాస్ రాష్ట్ర రాజధాని మానాస్ నుంచి బయలుదేరిన విమానం ప్రముఖ పర్యాటక కేంద్రం బార్సెలోస్ పరిసరాల్లో కూలింది. 

ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 12 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. 18 మంది ప్యాసెంజర్లను తరలించగలిగిన ఈ ట్విన్ ఇంజిన్ విమానాన్ని బ్రెజిల్ సంస్థ ఎంబ్రేయర్ తయారు చేసింది.

Brazil
Plane Crash
  • Loading...

More Telugu News