Nadendla Manohar: పవన్ విమానాన్ని కూడా నిలిపివేశారంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉన్నామో అర్థమవుతోంది: నాదెండ్ల మనోహర్

Nadendla Manohar take a jibe at AP Govt

  • నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్
  • సంఘీభావం తెలిపేందుకు ఏపీ రావాలనుకున్న పవన్
  • శంషాబాద్ లో విమానం టేకాఫ్ కు అనుమతి నిరాకరణ
  • గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి వెనుదిరిగిన నాదెండ్ల
  • ఇందుకేనా జగన్ కు 151 సీట్లు ఇచ్చింది అంటూ విమర్శలు

టీడీపీ అధినేత చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ విమానం టేకాఫ్ కు చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడం తెలిసిందే. శంషాబాద్ విమానాశ్రయం నుంచి రావాల్సిన పవన్ కల్యాణ్ విమానం రాకపోవడంతో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గన్నవరం విమానాశ్రయం నుంచి వెనుదిరిగారు. 

ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై నాదెండ్ల ధ్వజమెత్తారు. విజయవాడ వస్తున్న పవన్ కల్యాణ్ విమానాన్ని నిలిపివేశారంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉన్నామో అర్థమవుతుందని పేర్కొన్నారు. పవన్ కోసం తాను ఎయిర్ పోర్టుకు వస్తుంటే దారిపొడవునా ఆంక్షలేనని వెల్లడించారు. పవన్ కల్యాణ్ అంటే అంత భయం ఎందుకని ప్రశ్నించారు. 

ప్రజాస్వామ్యబద్ధంగా జీవించాలంటే ఈ ప్రభుత్వం ఎందుకు ఇబ్బందులకు గురిచేస్తోందని నిలదీశారు. ఇవాళ ఏపీలో ఆర్టీసీ బస్సులన్నీ నిలిపివేశారని, పోలీసులు నిర్బంధాలు, అరెస్టులు చేస్తున్నారని నాదెండ్ల విమర్శించారు. ఇందుకేనా జగన్ కు ప్రజలు 151 సీట్లు ఇచ్చింది... రాష్ట్రంలో పాలన ఎలా ఉందో ప్రజలు గమనించాలి అని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News