Sasikala: జైలు అధికారులకు లంచం కేసు.. శశికళపై అరెస్ట్ వారెంట్

Bengaluru Lokayukta court issues non bailable warrant against VK Sasikala

  • అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవించిన శశికళ, ఇళవరసి
  • మెరుగైన వసతుల కోసం జైలు అధికారులకు రూ. 2 కోట్ల లంచం ఆరోపణలు
  • విచారణకు హాజరుకాని న్యాయవాదులు
  • వచ్చే నెల 5కు విచారణ వాయిదా

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నెచ్చెలి శశికళకు కర్ణాటక లోకాయుక్త కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో మెరుగైన వసతుల కోసం జైలు అధికారులకు లంచమిచ్చినట్టు శశికళ అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

జైలు అధికారులకు రూ. 2 కోట్ల వరకు లంచమిచ్చినట్టు ఆమెపై కేసు నమోదైంది. నిన్న బెంగళూరులోని లోకాయుక్త కోర్టులో జరిగిన విచారణకు శశికళ, ఆమె మరదలు ఇళవరసి తరపు న్యాయవాదులు గైర్హాజరయ్యారు. దీంతో న్యాయమూర్తి వారిద్దరికీ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. వారికి బెయిలు పూచీకత్తు ఇచ్చిన వారికి కూడా నోటీసులు జారీ చేసిన కోర్టు తదుపరి విచారణను అక్టోబర్ ఐదో తేదీకి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News